Women's T20 Asia Cup 2026 | మహిళల టీ20 ఆసియా కప్ 2026
మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా బోణి కొట్టేందుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరిగే గ్రూప్-ఎ మ్యాచ్‌లో థాయిలాండ్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తలపడనుంది. గత ఐదు ఎడిషన్లలో మూడుసార్లు టైటిల్ గెలిచిన భారత్‌కు ఈ టోర్నీలో ఘనమైన రికార్డు ఉంది.
అయితే ఇటీవల భారత జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఆడిన 16 టీ20ల్లో ఏకంగా 9 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం, వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించడం జట్టును దెబ్బతీసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫామ్‌పై ప్రశ్నలు వస్తున్న వేళ, ఆసియా కప్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.
టాప్ ఆర్డర్లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం జట్టును వేధిస్తోంది. గాయంతో జెమిమా రోడ్రిగ్స్ దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీకా రావల్ వచ్చారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, శ్రీ చరణి, రాధా యాదవ్‌లతో స్పిన్ విభాగం, రేణుకా సింగ్ నేతృత్వంలో పేస్ విభాగం బలంగా ఉన్నాయి. గత మ్యాచ్‌లలో జరిగిన ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవడంపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టింది. భారత్‌తో పోలిస్తే చిన్న జట్టే అయినా థాయిలాండ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















