Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన శ్రీలంక జట్టు.. గత కొన్నేళ్లుగా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. సీనియర్ ప్లేయర్స్ తప్పుకోవడంతో పతనం వైపు సాగుతున్న శ్రీలంకకు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) రూపంలో మరో కోలుకోలేని షాక్ తగిలింది.
2027లో శ్రీలంక వేదికగా జరగాల్సిన తొలి 'మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ' ఆతిథ్య హక్కులను ఐసీసీ రద్దు చేసింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన ఈ టోర్నమెంట్ ఇకపై శ్రీలంక గడ్డపై జరగదని స్పష్టం చేసింది. క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో శ్రీలంక ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తుంది.
బోర్డులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదనే ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వం బోర్డును తన ఆధీనంలోకి తీసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో కూడా ఇదే కారణంతో 2024 పురుషుల అండర్-19 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోగా, దాన్ని దక్షిణాఫ్రికాకు కేటాయించారు. ఇప్పుడు వేదిక మారడమే కాకుండా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్న శ్రీలంక మహిళల జట్టు ఈ 6 జట్ల టోర్నీలో ఆడే అర్హత సాధిస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు





















