Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లోను హాఫ్ సెంచరీతో చెలరేగుతున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆరంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. లక్నోతో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఇచ్చిన స్పీచ్ కు ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. తాను ఇంకా 100 పర్సెంట్ ఫిట్‌గా లేనని.. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో పాటు హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
"ఫిట్‌నెస్ ప్రాబ్లమ్ ఉన్నా, టీమ్ కోసం మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడం సంతోషంగా ఉంది" అని విరాట్ పేర్కొన్నాడు. అలాగే మా టీమ్ లో రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్ వంటి స్టనింగ్ ప్లేయర్స్ ఉన్నారు. చివరి 4 ఓవర్లలో 50 పరుగులు చేయగలరనే నమ్మకం మాకుంది. కృనాల్ పాండ్యా వంటి ప్లేయర్ కు ఇంకా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదంటే మా లైనప్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ డెప్త్ వల్లే నేను, ఫిల్ సాల్ట్ స్టార్టింగ్ లో ఎలాంటి ప్రెషర్ లేకుండా హిట్టింగ్ చేయగలుగుతున్నాం" అని విరాట్ వివరించాడు.
కెప్టెన్ రజత్ పాటిదార్‌పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. పాటిదార్‌కు గేమ్ పై ఉన్న క్లారిటీ సూపర్ అన్నాడు. మొత్తానికి, హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా విరాట్ కోహ్లీ ఆరంజ్ క్యాప్ అందుకోవడం.. ఆర్‌సీబీ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది.
ట్రెండింగ్ వార్తలు




















