Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం వ్యక్తిగత రికార్డులను వెంటాడితే సుదీర్ఘ కాలం పాటు కెరీర్‌ను కొనసాగించలేమని భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 88 బంతుల్లోనే 139 పరుగులతో అజేయంగా నిలిచి, వన్డేల్లో 15,000 పరుగుల చారిత్రక మైలురాయిని చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచిన అనంతరం, బీసీసీఐతో మాట్లాడిన కోహ్లీ తన మనసులోని మాటలను పంచుకున్నారు.
తన ప్రధాన లక్ష్యం మాత్రం ఎప్పుడూ టీమ్ ను గెలిపించడమేనని కోహ్లీ తెలిపారు. కేవలం రికార్డుల కోసమే ఆడితే ఎక్కువ కాలం ఆటలో నిలబడలేమని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ.. గిల్ టీమ్ లోకి వచ్చినప్పటి నుంచి ఎంతో సరదాగా ఉంటాడని, గ్రౌండ్ లో తాము ప్రశాంతంగా ఉంటూ కుర్రాళ్లపై ప్రెషర్ లేకుండా చూసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు, కోహ్లీ 15,000 పరుగుల మైలురాయిని అందుకునే సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో తాను ఉండటం అదృష్టమని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నారు. చిన్నప్పటి నుంచి కోహ్లీని చూస్తూ పెరిగానని, ఇప్పుడు అదే లెజెండ్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తూ మైలురాళ్లను పంచుకోవడం గొప్ప అనుభూతి అని గిల్ సంతోషం వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















