Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
ఫిఫా వరల్డ్ కప్ 2026లో బ్రెజిల్ స్టార్ వినీసియస్ జూనియర్ తన దేశ ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. తాజాగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వినీసియస్ రెండు మెరుపు గోల్స్‌తో స్టేడియాన్ని షేక్ చేశాడు. ఈ ప్రదర్శనతో వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఆడిన మొదటి మూడు మ్యాచుల్లోనూ వరుసగా గోల్స్ చేసిన మోడర్న్ ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
గత 24 ఏళ్లలో ఏ బ్రెజిల్ ప్లేయర్‌కు కూడా ఇది సాధ్యం కాలేదు. దీనికంటే ముందు 2002 వరల్డ్ కప్‌లో లెజెండ్స్ రోనాల్డో నజారియో, రివాల్డోలు మాత్రమే ఈ రేర్ రికార్డును సాధించారు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ఫస్ట్ హాఫ్ 7వ నిమిషంలోనే స్కాట్లాండ్ డిఫెండర్ లూజ్ బాల్‌ను అందుకున్న వినీసియస్.. విండ్ స్పీడ్‌తో దూసుకెళ్లి గోల్ కీపర్‌ను దాటుకుంటూ బాల్‌ను నెట్‌లోకి పంపించాడు. అంతకుముందు మొరాకో, హైతీలపై కూడా వినీసియస్ సూపర్ గోల్స్ కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.
ఇక ఫస్ట్ హాఫ్ ముగిసే సరిగ్గా కొన్ని నిమిషాల ముందు.. బ్రూనో గుమారెస్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్ పాస్‌ను కరెక్ట్ టైమ్‌లో అందుకున్న వినీసియస్, పవర్‌ఫుల్ హెడర్ ద్వారా తన పర్సనల్ రెండో గోల్ కొట్టి బ్రెజిల్‌కు 2-0 లీడ్ అందించాడు. బ్రెజిల్ హిస్టరీలో జైర్జినో, రొమారియో, రోనాల్డో, రివాల్డో తర్వాత ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్ వినీసియస్.
ట్రెండింగ్ వార్తలు






















