Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన గేమ్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ యంగ్ స్టార్.. తాజాగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 19వ ఓవర్లో వేలి గాయం వల్ల మైదానం వీడాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ సూర్యవంశీ జట్టు బాధ్యతలను స్వీకరించాడు.
ఈ తాత్కాలిక కెప్టెన్సీలో 40వ ఓవర్లో వైభవ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే స్లిప్‌లో ఉన్న వైభవ్, బంతి బ్యాట్‌ను తాకినట్లు గమనించి వెంటనే డీఆర్ఎస్ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించాడు. వైభవ్ తీసుకున్న ఈ మాస్టర్‌మైండ్ రివ్యూతో 46 పరుగుల వద్ద ఉన్న ఆర్యన్ జుయల్ పెవిలియన్ చేరాడు. గ్రౌండ్ లో వైభవ్ చూపించిన మైండ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ పై కామెంటేటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















