Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
ఇండియా ‘ఎ’, అఫ్గానిస్తాన్ ‘ఎ’ మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్ ఒక బిగ్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టీమిండియా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన షాకింగ్ డెసిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
మ్యాచ్ స్టార్టింగ్‌లో వైభవ్ ఇంకా ఖాతా తెరవకముందే అఫ్గాన్ ఫీల్డర్ ఒక క్లీన్ క్యాచ్ అందుకున్నాడు. తాను అవుట్ అయ్యానని ఫిక్స్ అయిన వైభవ్, అప్పటికే పిచ్ వదిలి బౌండరీ లైన్ వరకు వెళ్లాడు. కానీ రిప్లైస్‌లో క్యాచ్ క్లియర్‌గా ఉన్నట్లు కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బాల్ నేలకు తగిలిందనే సాకుతో ‘నాటౌట్’ అని ప్రకటించాడు. ఈ విచిత్రమైన నిర్ణయంతో మైండ్ బ్లాక్ అయిన అఫ్గాన్ ప్లేయర్స్ అంపైర్లతో గట్టిగా వాగ్వాదానికి దిగారు.
లంక టూర్‌లో మాత్రం తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అంపైర్ పుణ్యమా అని లైఫ్ లైన్ దక్కినా, ఈ మ్యాచ్‌లో తను కేవలం 38 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో లంక ప్లేయర్‌తో గొడవ పడి వార్తల్లో నిలిచిన వైభవ్, ఇప్పుడు ఈ అంపైరింగ్ వివాదంతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారాడు.
ట్రెండింగ్ వార్తలు






















