Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన వైభవ్, రెండు ఇన్నింగ్స్‌లలో 92, 40 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 92 పరుగులు చేసిన వైభవ్.. దులీప్ ట్రోఫీ చరిత్రలోనే హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 159 పరుగుల లక్ష్య ఛేదనలోనూ 40 పరుగుల ఆరంభాన్ని ఇచ్చాడు. నాకౌట్ మ్యాచ్‌లలో నిలకడగా రాణించే వైభవ్, 11 ఇన్నింగ్స్‌లలో 65.18 సగటుతో 717 పరుగులు చేసి బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు.
మరోవైపు రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్‌ను 158 పరుగులకే కుప్పకూల్చడంలో పేసర్లు ముకేష్ కుమార్, మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ మొత్తం ఐదు వికెట్లు తీసిన షమీ టీమిండియా రీఎంట్రీ రేసులో నిలిచాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని కెప్టెన్ ఇషాన్ కిషన్ తన సూపర్ బ్యాట్టింగ్ చేయడంతో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
ట్రెండింగ్ వార్తలు






















