Usman Tariq inspired by MS Dhoni | పాక్ బౌలర్ జీవితాన్ని మార్చిన ఎంఎస్ ధోని
టీ20 వరల్డ్ కప్ లో ( T20 World Cup ) భాగంగా ఇండియా పాకిస్తాన్ ( India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కు ముందు అందరి చూపు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్ ( Usman Tariq ) వైపే ఉనింది. అందుకు కారణం అతను బౌలింగ్ చేసే విధానం. ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బంతిని వేస్తున్నాడో లేక త్రో చేస్తున్నాడో అర్థం కాక బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు.
ఆగి బాల్ వేయడం వల్ల, స్పీడ్ ని అంచనా వేయలేకపోతున్నారు బ్యాట్సమన్. దాంతో వికెట్స్ పడుతున్నాయి. అయితే తన బౌలింగ్ యాక్షన్ తో కేవలం పాకిస్తాన్ లో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. పాకిస్తాన్ టీమ్ లో కీలక ప్లేయర్ గా మారిన ఉస్మాన్ వెనక ఒక పెద్ద కథ దాగి ఉంది.
కొన్నేళ్ల క్రితం పాక్ జాతీయ జట్టులో అవకాశం రాక విసిగిపోయిన ఉస్మాన్ తారీఖ్, కుటుంబాన్ని పోషించడానికి దుబాయ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసేవాడు. తన జీవితం ముగిసిపోయింది అనుకుంటున్న టైంలో 'ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా చూశాడట. దాంతో మళ్ళీ బ్యాట్, బాల్ పట్టాడు. ఎదో ఒకటి తేల్చుకుందాం అనుకోని ఉద్యోగం వదిలేసి స్వదేశానికి చేరుకున్నాడు. మళ్ళి పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి మిస్టరీ స్పిన్నర్ గా మారాడు. జాతీయ జట్టులో అవకాశం రావడం మాత్రమే కాకుండా ఇప్పుడు పాక్ టీమ్ లో కీలక ప్లేయర్ గా మారాడు.























