Tokyo Olympics, Hockey: 41 ఇయర్స్ తర్వాత నెరవేరిన కల
ఇండియన్ హాకీ ఫుల్ జోష్ లో వుంది. మెన్స్ హాకీ టీం జర్మనీ మీద గెలిచి , ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది.
ఈ విజయం పై ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ మాట్లాడారు . ఇండియన్ మెన్ హాకీ టీం 41 ఇయర్స్ తర్వాత ఒలింపిక్ మెడల్ విన్ అయింది.
ఒక హాకీ ప్లేయర్ గా, చాలా ప్రౌడ్ గా ఉందన్నారు. జర్మనీ మీద అద్భుతంగా ఆడారు. మన్ ప్రీత్ సింగ్ , హర్మన్ ప్రీత్ సింగ్ చాలా బాగా ఆడారని,
మిగతా ప్లేయర్స్ కూడా బాగా సపోర్ట్ చేసారని అన్నారు. ఆర్జెంటినా తో ఆడినపుడు అనవసర తప్పిదాలు చేసారు. అందుకే మ్యాచ్ లాస్ అయ్యాం.
జర్మనీ తో ఆడినపుడు కాన్ఫిడెంట్ గా ఆడారు. అందుకే విన్ అయ్యాం. ఇదే ఊపు తో విమెన్ హాకీ టీం కూడా రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.





















