Sunil Gavaskar ICC World Cup Pakistan | ఐసీసీకి సునీల్ గవాస్కర్ సూచన
2026 టీ20 వరల్డ్ కప్‌లో ( 2026 T20 World Cup ) భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత మాజీ క్రికెట్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) స్పందించారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను ఐసీసీ సహించకూడదని ఆయన స్పష్టం చేశారు.
"టోర్నీకి కొన్ని రోజుల ముందు లేదా టోర్నీ మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సరికాదు. పాక్ వైఖరిని ఐసీసీ తీవ్రంగా పరిగణించాలి. భవిష్యత్తులో ఏ దేశం కూడా ఇలాంటి సాహసం చేయకుండా ఉండేలా పాకిస్థాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలి" అని గవాస్కర్ పేర్కొన్నారు. కేవలం పాయింట్లు డిడెక్షన్ మాత్రమే కాకుండా, ఆర్థికపరమైన జరిమానాలు కూడా వేయాలని ఆయన సూచించారు.
పాక్ ఒకవేళ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని నిలిపివేయడంతో పాటు, భవిష్యత్తులో పాకిస్థాన్ నిర్వహించాల్సిన ఐసీసీ టోర్నీల హోస్టింగ్ హక్కులను కూడా వెనక్కి తీసుకోవాలని గవాస్కర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పాకిస్థాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League ) ఆడే విదేశీ ఆటగాళ్లకు ఎన్‌వోసీలు ఇవ్వకుండా అడ్డుకోవడం ద్వారా ఆ దేశ క్రికెట్‌ను గట్టిగా దెబ్బకొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.



















