Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలెక్టర్ పదవి వెనుక ఉండే చీకటి కోణాలు, నిరంతర ఒత్తిళ్లపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పదవి ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తూ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి ఎంత గౌరవప్రదమైనదో, అంతే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వీపుపై ఒక టార్గెట్ బోర్డు అమర్చినట్లే ఉంటుందని గవాస్కర్ విశ్లేషించారు. తాము చేసిన తొమ్మిది మంచి పనులను జనం త్వరగా మర్చిపోతారని, కానీ చేశారనుకునే ఒక్క పొరపాటును వంద రెట్లు పెద్దది చేసి విమర్శిస్తారని పేర్కొన్నారు. సెలెక్షన్ కమిటీ అంతర్గత వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయని ఆయన తెలిపారు.
గతంలో కెప్టెన్ కూడా సెలెక్షన్ మీటింగ్‌లో ఉన్నప్పుడు, కొందరు సెలెక్టర్లు బయటకు వచ్చి తమకు నచ్చిన మీడియా వ్యక్తులతో రహస్యంగా మాట్లాడి అన్ని విషయాలు చెప్తూ కెప్టెన్‌పై నెట్టేసేవారని తన పాత అనుభవాలను గుర్తుచేశారు.
ట్రెండింగ్ వార్తలు






















