Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. తన సెంచరీతో పాటు మ్యాచ్‌ను మలుపు తిప్పిన బౌలర్లు, బ్యాటర్ల ప్రదర్శనను కొనియాడారు.
తాను చేసిన 110 పరుగుల సెంచరీపై స్పందిస్తూ.. "నేనే స్వయంగా క్రీజులో ఉండి మ్యాచ్ ముగించి రావాల్సింది అనిపించింది. చివరి వరకు నిలబడలేకపోయినా ఈ ఇన్నింగ్స్ నాకు మంచి సంతృప్తినిచ్చింది" అని గిల్ తెలిపారు. అలాగే, 4 వికెట్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన కుల్దీప్ యాదవ్ ప్రదర్శనను గిల్ ప్రత్యేకంగా అభినందించారు. వెస్టిండీస్ ఓపెనర్లు వేగంగా ఆడుతున్న దశలో కుల్దీప్ వచ్చి మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, ప్రత్యర్థిని 300 పరుగుల లోపే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించారు.
ఇదే సమయంలో అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిన విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు మైదానంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ఆయన ప్రస్తుతం ఆటను ఎంతో ఆస్వాదిస్తూ ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తున్నారని గిల్ వెల్లడించారు. సమిష్టి కృషితో సాధించిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















