RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
ఐపీఎల్ 2026లో ఒక అద్భుతం చోటుచేసుకుంది అనే చెప్పాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిస్టరీ స్పిన్నర్ సుయాశ్ శర్మ .. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా సుయాశ్ శర్మ చరిత్ర సృష్టించాడు.
తాను వేసిన 4 ఓవర్లలో ఏకంగా 20 డాట్ బాల్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన సుయాశ్, ఒక ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించాడు. సుయాశ్ వేసిన 24 బంతుల్లో 20 బంతులకు ఢిల్లీ బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేక పొయ్యారు.
ఈ అద్భుత ప్రదర్శనతో సుయాశ్ శర్మ.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు మీద ఉన్న 16 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేశాడు. 2010లో డెక్కన్ ఛార్జర్స్‌పై అశ్విన్ 18 డాట్ బాల్స్ వేశాడు. ఆ తర్వాత చాహల్, రషీద్ ఖాన్ ఈ రికార్డును సమం చేసినప్పటికీ, ఎవరూ 20 డాట్ బాల్స్ మార్కును అందుకోలేకపోయారు. ఆ ఘనతను ఇప్పుడు సుయాశ్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు






















