Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
సీజన్ మొత్తం పాయింట్స్ టేబుల్ లో పైకి కిందకి పడుతూ ఫైనల్ కు చేరిన గుజరాత్ టైటాన్స్... సరిగ్గా అదే మ్యాచ్‌లోనే బోర్లా పడింది. లీగ్ స్టేజ్‌లో ప్రత్యర్థులను భయపెట్టిన గుజరాత్ బ్యాటింగ్ లైన్ అప్ ఆర్సీబీ చేతిలో మాత్రం ఓడిపోయింది. పవర్ ఫుల్ బ్యాటర్స్.. సువర్ బౌలర్స్ ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడానికి రీసన్ ఏంటో ఇప్పుడు చూదాం.
మొదటి పాయింట్ టాప్ ఆర్డర్ చేతులెత్తేయడం. ఈ సీజన్ లో గుజరాత్‌ను ఎన్నో మ్యాచులో ఒంటిచేత్తో గెలిపించిన శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ లాంటి బ్యాటర్లు అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లు భువీ, హేజిల్‌వుడ్ వేసిన స్వింగ్‌ను ఎదుర్కోలేక పవర్‌ప్లేలోనే వికెట్లు పారేసుకున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్. పవర్‌ప్లేలోనే వికెట్లు పడిపోయినప్పుడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అనవసర షాట్లకు పోయి వరుసగా అవుట్ అయ్యారు.
తక్కువ స్కోర్ ని గుజరాత్ బౌలర్లు డిఫెండ్ చేసుకోలేక పొయ్యారు. మొదట్లోనే వికెట్లు తీసి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టాల్సింది. కానీ సిరాజ్, రబాడ వేసిన పవర్‌ప్లే ఓవర్లలోనే విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ భారీగా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో మ్యాచ్ అక్కడే గుజరాత్ చేతుల్లోంచి చేజారిపోయింది. లీగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టి.. ఫైనల్ ప్రెజర్‌ను తట్టుకోలేక గుజరాత్ టైటాన్స్ కప్ గెలవకుండానే వెనుదిరిగింది.
ట్రెండింగ్ వార్తలు

















