RCB vs Delhi Capitals WPL Final | నేడే WPL ఫైనల్ మ్యాచ్
క్రికెట్ అభిమానులను నెల రోజులుగా ఎంతో ఎంటర్టైన్ చేసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( Women's Premier League ) మూడో సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. గుజరాత్‌లోని వడోదర వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ), ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) తలపడనున్నాయి.
గత సీజన్ లో ఇదే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఆర్‌సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ ఏడాది కూడా ఆరంభం నుంచే అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ, పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచి అందరికంటే ముందుగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. స్మృతి మంధాన ( Smriti Mandhana ) సారథ్యంలో టీమ్ అంతా సూపర్ గా రాణిస్తుంది. వరుసగా రెండో ఏడాది కూడా ఛాంపియన్‌గా నిలిచి, రికార్డును తమ ఖాతాలో వేసుకోవాలని బెంగళూరు పట్టుదలగా ఉంది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ చరిత్రలో వరుసగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే, గత మూడు సార్లు ఫైనల్‌కు వచ్చినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి ఢిల్లీ కొత్త కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) నేతృత్వంలో జట్టు పక్కా ప్రణాళికతో కనిపిస్తోంది. ట్రోఫీని ముద్దాడి తమ కల నెరవేర్చుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.























