Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో కనిపిస్తే అగ్రెషన్ పీక్స్‌లో ఉంటుంది. అయితే, కోహ్లీపై ఉన్న ఒక బిగ్గెస్ట్ మిత్ గురించి కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీతో కలిసి చాలా ఏళ్లు ట్రావెల్ చేసిన శాస్త్రి.. విరాట్ క్యారెక్టర్ వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాడు.
కోహ్లీ అహంకారి, ఒక మొండి పిల్లాడిలా బిహేవ్ చేస్తాడు అని బయట అనుకునేదంతా కేవలం క్రికెట్ గ్రౌండ్ వరకే పరిమితం అని, ఫీల్డ్ బయట కోహ్లీ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అని శాస్త్రి స్పష్టం చేశాడు. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లి, బయటకు రాగానే నార్మల్‌గా మారిపోయే ఆ ‘స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్’ క్వాలిటీ కోహ్లీలో అద్భుతమని కొనియాడాడు.
రవిశాస్త్రి, కోహ్లీ కాంబినేషన్‌లో ఇండియా టీమ్ ఎన్నో మైలురాళ్లను అందుకుంది. కోహ్లీ గ్రౌండ్ లో చూపే ఆ అగ్రెషన్ వెనుక కేవలం టీమ్ గెలవాలనే తపన మాత్రమే ఉంటుందని శాస్త్రి క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా స్లో అండ్ స్పిన్ అనుకూల పిచ్ ల మీద కూడా కోహ్లీ తన టెక్నిక్‌తో రన్స్ చేయగలడని ప్రశంసించాడు.
ట్రెండింగ్ వార్తలు






















