MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
ఐపీఎల్ 2026 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ కీలక పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.
టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 41 పరుగులకే ముంబై 4 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోరుకే వెనుతిరిగారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు.
అయితే, ఆఖర్లో కార్బిన్ బాష్ 18 బంతుల్లో 32 రన్స్‌తో మెరుపులు మెరిపించడంతో ముంబై 20 ఓవర్లలో 147 పరుగులు చేయగలిగింది.
ఆ తర్వాత 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు కూడా ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ ఫిన్ అలెన్ త్వరగానే అవుట్ కాగా, కార్బిన్ బాష్ వరుస ఓవర్లలో రహానే, కెమరూన్ గ్రీన్‌లను అవుట్ చేసి కేకేఆర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆఖర్లో అనుకుల్ రాయ్, రింకూ సింగ్ క్రీజులో ఉండి మరో 7 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ కు విజయాన్ని అందించారు.
ట్రెండింగ్ వార్తలు





















