(Source: Poll of Polls)
MI vs CSK Highlights IPL 2026 | ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ విక్టరీ
ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి సంజూ శాంసన్ బ్యాక్ బోన్ లాగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా, సంజూ మాత్రం చెలరేగి 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి మొదట్లోనే చుక్కెదురైంది. స్పిన్నర్ అకీల్ హోసెన్ తొలి ఓవర్‌లోనే డానిష్ మలేవార్‌ను డకౌట్ చేసి ముంబై పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను కూడా పెవిలియన్ చేర్చిన అకీల్.. కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
ముంబై ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సున్నాకే వెనుదిరిగారు. మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ఈ భారీ విజయంలో అకీల్ హోసెన్ బౌలింగ్‌తో పాటు సంజూ శాంసన్ శతకం కీలక పాత్ర పోషించాయి.
ట్రెండింగ్ వార్తలు






















