KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయిన కోల్కతా ... ఫైనల్ గా బోణి కొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్కోర్ తక్కువగానే ఉన్నపటికీ బౌలర్లు, బ్యాటర్లు బాగా రాణించారు.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌ను కేకేఆర్ బౌలర్లు వణికించారు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేసారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తీ, కార్తీక్ త్యాగీ తమ స్పెల్ తో రాజస్థాన్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. రాజస్థాన్ 20 ఓవర్లలో 155 పరుగులకే పరిమితమైంది.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు మొదట్లోనే షాక్ తగిలింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. అప్పుడు వచ్చిన ఫినిషర్ రింకూ సింగ్ విరుచుకుపడ్డాడు. కేవలం 34 బంతుల్లోనే 53 పరుగులు చేసి తమ టీమ్ కు మొదటి విజయాన్ని అందించాడు. అనుకుల్ రాయ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో కేకేఆర్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది.
ట్రెండింగ్ వార్తలు




















