Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న ఒకే ఒక విషయం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్. సాధారణంగా బుమ్రా బాల్ వేస్తె బ్యాటర్లకు చెమటలు పట్టాల్సిందే. కానీ ఈ సీజన్‌లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
ఇప్పటివరకు ముంబై ఆడిన 5 మ్యాచుల్లో బుమ్రా ఎకానమీ రేటు 9.5 దాటిపోయింది. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాట్స్మన్ ను వణికించిన బుమ్రా, ఇప్పుడు లెంగ్త్ బాల్ వేసి భారీగా పరుగులు ఇస్తున్నాడు. మెయిన్ గా పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో ఫెయిల్ అవడం ముంబై ఇండియన్స్‌కు ప్రాబ్లంగా మారింది.
బుమ్రా బౌలింగ్‌ను బ్యాటర్లు చాలా ఈజీగా ఆడుతున్నారు. స్లోయర్ బంతులను కూడా ముందే పసిగట్టి స్టాండ్స్ లోకి పంపిస్తున్నారు. బుమ్రా వికెట్లు తీయకపోవడంతో మిగతా బౌలర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ముంబై వరుస ఓటములకు ఇది ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే బుమ్రా తన పాత ఫామ్ అందుకోవడం చాలా ముఖ్యం. బూమ్ బూమ్ అంటూ మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని వెయిటింగ్ లో ఉన్నారు ఫ్యాన్స్.
ట్రెండింగ్ వార్తలు




















