Virat Kohli 54 vs LSG IPL 2025 | భారీ లక్ష్యం కళ్ల ముందున్నా...లక్ష్యానికి పద నిర్దేశం చేశాడు
జనరల్ గా భారీ టార్గెట్ కళ్ల ముందు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు. ముందు జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్లి క్రీజులో కుదురుకున్నాక గేర్లు మార్చి దుమ్ము రేపుతారు. ఇదో స్టైల్ కానీ కింగ్ విరాట్ కొహ్లీ స్టైల్ వేరే ఉంటుంది. నువ్వు పెట్టిన లక్ష్యం నా కళ్ల ముందు అసలు అది లక్ష్యమే కాదు అన్నట్లు బౌలర్లను భయపెట్టేలా మొదటి బంతి నుంచి ఎటాక్ చేస్తూనే ఉంటాడు. నిన్నా అదే చేశాడు. లక్నో విసిరిన 228 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో విరాట్ కొహ్లీ బ్యాటింగ్ మచ్చల పులి వేటను తలపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో ఏ ఓవర్ కూడా రన్ రేట్ 10 కి తగ్గకుండా పరుగులు రాబడతూనే ఉన్నాడు. సాల్ట్ 30 పరుగులు చేయటంతో మంచి సపోర్ట్ లభించిన కొహ్లీ 30 బాల్స్ ఆడి 10 ఫోర్లు బాది 54పరుగులు చేశాడు. ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు మాత్రమే ఆడిన కొహ్లీకి ఇది 8వ సెంచరీ అంటే అర్థం చేసుకోవచ్చు. కొహ్లీ ఏ రేంజ్ లో సీజన్ లో విధ్వంసం సాగిస్తున్నాడో. ఈ సీజన్ లో 147 స్ట్రైక్ రేట్ తో 602 పరుగులు చేసి విరాట్ కొహ్లీ...ఓ సీజన్ లో 600లకు పైగా పరుగులు అత్యధిక సార్లు నమోదు చేసిన ఐపీఎల్ బ్యాటర్ గానూ..8 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి బ్యాటర్ గానూ రికార్డులు నెలకొల్పాడు. అంతే కాదు నిన్నటి ఇన్నింగ్స్ తో ఐపీఎల్ లో 9వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్ గా నిలిచిన కొహ్లీ ప్రపంచ చరిత్రలోనే ఓ టీమ్ కు అత్యధిక పరుగుల కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ఆటగాడిగా మరే ఆటగాడికి అందనంత రేంజ్ లో 9వేల పరుగులతో టాప్ లో నిలిచాడు. ఇన్ని రికార్డులతో పాటు కొహ్లీ నిన్న కొట్టిన హాఫ్ సెంచరీనే జితేష్ శర్మ కు కొండంత ధైర్యాన్ని, ఛేజ్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ ను కల్పించింది. అందుకే జితేశ్ అద్భుతం చేశాక కృనాల్ పాండ్యా తో కలిసి డగౌట్ లో చిన్న పిల్లాడిలా గంతులేశాడు. అనుష్క శర్మకు ఫ్లైయింగ్ కిసెస్ తో తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు కింగ్ విరాట్ కొహ్లీ.





















