SRH vs GT Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ ను సొంత గడ్డపై ఓడించిన గుజరాత్ టైటాన్స్ | ABP Desam
మ్యాచ్ కు మ్యాచ్ కు ఈ మ్యాచ్ కి మళ్లీ టచ్ లోకి వస్తారు. ఒక్కసారి వస్తే వాళ్లని ఆపటం ఎవ్వరి తరం కాదు అంటూ మనకు మనం ఎలివేషన్స్ వేసుకోవటం తప్ప...మన ఆరెంజ్ ఆర్మీ ఇప్పట్లో కోమాలో నుంచి లేచేలా లేదు. సొంత పిచ్ పై కూడా ప్రత్యర్థులకు మ్యాచ్ లను ఇచ్చేయటం అలవాటు చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు గుజరాత్ టైటాన్స్ మీదా ఓడిపోయి ఈ సీజన్ లో వరుసగా నాలుగో ఓటమిని చవి చూసింది. మ్యాచ్ మొత్తం డామినేషన్ చూపిస్తూ 7 వికెట్ల తేడాతో SRH పై గుజరాత్ టైటాన్స్ నెగ్గిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. మోడల్ మోడల్ సిరాజ్ మోడల్
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న జీటీ కెప్టెన్ శుభ్ మాన్ గిల్ ధైర్యాన్ని సపోర్ట్ చేస్తూ సొంత పిచ్ పై హైదరాబాదీ మియా సిరాజ్ భాయ్ చెలరేగిపోయాడు. తనకు బాగా తెలిసిన గ్రౌండ్ లో తన జట్టు గుజరాత్ మురిసిపోయేలా బౌలింగ్ చేశాడు. ఇనీషియల్ ఓవర్స్ నుంచే కాటేరమ్మ కొడుకులను ఇబ్బంది పెడుతూ వికెట్ల వేట సాగించాడు. మొదటి ఓవర్ చివరి బంతికి హెడ్ ను అవుట్ చేసి..తన మూడో ఓవర్లో మరో ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్టు తీసి మ్యాచ్ ను జీటీ వైపు తిప్పేశాడు. తన ఆఖరి ఓవర్ లో అనికేత్ వర్మ, సిమర్జిత్ సింగ్ వికెట్లూ తీసుకుని 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయటం ద్వారా సన్ రైజర్స్ ను చావు దెబ్బ తీశాడు సిరాజ్ మియా.
2. కాపాడిన నితీశ్, క్లాసెన్
50 పరుగులకే మూడు వికెట్లు. హెడ్, అభిషేక్ లను సిరాజ్ అవుట్ చేస్తే..ఇషాన్ కిషన్ సంగతి ప్రసిద్ధ్ కృష్ణ చూసుకున్నాడు. మరి అలాంటి టైమ్ లో నితీశ్, క్లాసెన్ సన్ రైజర్స్ ను కాసేపు ఆదుకున్నారు. టెస్ట్ బ్యాటింగ్ ఆఢుతున్నట్లే ఆడినా కాస్తో కూస్తో రన్స్ చేశారు ఈ ఇద్దరూ. నితీశ్ 31, క్లాసెన్ 27 పరుగులు చేసి అవుటయ్యారు. చివర్లో కమిన్స్ 9 బంతుల్లోనే 22 పరుగులు చేయటంతో సన్ రైజర్స్ 152 పరుగులు అన్నా చేసి 153 టార్గెట్ ఇచ్చింది సన్ రైజర్స్ కు.
3. సూపర్ సాయి కిశోర్
సన్ రైజర్స్ ను నిలబెడుతున్నారన్న అన్న డౌట్ వచ్చే టైమ్ లో నితీశ్ రెడ్డి, క్లాసెన్ వికెట్లు తీశాడు జీటీ స్పిన్నర్ సాయి కిశోర్. 19 బంతుల్లోనే 27పరుగులు చేసిన క్లాసెన్ ను మరింత ప్రమాదకరంగా మారకుండా క్లీన్ బౌల్డ్ చేసిన సాయి కిశోర్..నితీశ్ వికెట్టును దొరకబుచ్చుకుని సన్ రైజర్స్ ను 152కే చుట్టేసేలా చేశాడు.
4. కెప్టెన్ గిల్ షో
153పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ స్టార్టింగ్ లోనే ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ వికెట్ ను కోల్పోయినా ఎక్కడా బెదరలేదంటే రీజన్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్. వన్ డౌన్ లో వచ్చిన బట్లర్ డకౌట్ అయినా...వాషింగ్టన్ సుందర్ తో కలిసి జీటీ ని విజయం దిశగా నడిపించాడు గిల్. బ్యాడ్ లక్ కొద్దీ ఓ వివాదాస్పద క్యాచ్ కారణంగా సుందర్ 49 పరుగులకు వెనుదిరిగినా...గిల్ మాత్రం జోరు ఆపలేదు. 43 బాల్స్ ఆడి 9 క్లాసిక్ ఫోర్స్ కొట్టి 61 పరుగులు చేసి తన టీమ్ ను గెలుపులో కీలకపాత్ర పోషించాడు గిల్.
5. రూథర్ ఫర్డ్ ఫినిషింగ్.
సుందర్ బ్యాడ్ లక్ కొద్దీ అవుటైనా గిల్ కి తోడుగా ఉంటూనే బ్యాట్ ను బీభత్సంగా ఝుళిపించాడు షెర్ఫీన్ రూథర్ ఫర్డ్. 16 బాల్స్ లోనే 6 ఫోర్లు ఓ సిక్సర్ తో 35 పరుగులు చేసి ఇంకా 20 బంతులు ఉండగానే మ్యాచ్ ను ఫినిష్ చేసేశాడు రూథర్ పోర్డ్.
ఈ విక్టరీతో సీజన్ లో మూడో విజయం సాధించిన గుజరాత్ సెకండ్ ప్లేస్ కి వెళ్లిపోగా...సన్ రైజర్స్ తన ఆఖరి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.





















