అన్వేషించండి

Mumbai Indians Fixing With Umpires | ఎప్పట్లానే ముంబై చుట్టూ ఫిక్సింగ్ గోల | ABP Desam

 ఎప్పుడూ ముంబై ఇండియన్స్ గెలుస్తున్నా ఒకటే గోల. ఐపీఎల్ ఫిక్స్ చేశారు. వాళ్లు మ్యాచ్ లు గెలవటానికి అంపైర్లతో మాట్లాడేసుకున్నారు. అందుకే అంపైర్ల నిర్ణయాలన్నీ ముంబైకి అనుకూలంగా వస్తాయి అని. ఇప్పుడు వరుసగా ఆరు మ్యాచులు గెలిచి ముంబై టేబుల్ టాపర్ స్థాయికి వెళ్లింది. మరి ఈ జర్నీలో ముంబైకి అంపైర్లు సహకరిస్తున్నారా అనేది మిగిలిన టీమ్స్ అభిమానులకు పెద్ద ప్రశ్న. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనే రెండు వివాదాస్పద నిర్ణయాలు ఉన్నాయి. రెండూ ముంబై బ్యాటింగ్ చేస్తున్నప్పుడే జరిగాయి. మొదటి ఘటన రెండో ఓవర్ ఆఖరి బంతికి జరిగింది. ఫజల్ ఫరూఖీ వేసిన బాల్ ను మిస్సయిన హిట్ మ్యాన్..ప్యాడ్ కి బంతిని తాకించుకున్నాడు. దీంతో ఫరూఖీ అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. అయితే రికెల్టెన్ తో ఆ నిర్ణయంపై డీఆర్ఎస్ కి వెళ్లాలా లేదా అని చర్చిస్తూ కూర్చున్నాడు రోహిత్ శర్మ. వెంటనే డీఆర్ఎస్ కి వెళ్తున్నాడా లేదా చెప్పకుండా నిర్ణీత టైమ్ వరకూ వెయిట్ చేశాడు. కరెక్ట్ గా టైమర్ సున్నా మీద వచ్చాక డీఆర్ఎస్ అడిగాడు. టైమ్ అయిపోయింది నువ్వు ఇక అవుటే అని చెప్పాల్సిన అంపైర్ మాత్రం సున్నా మీద అడిగినా కూడా రోహిత్ నిర్ణయాన్ని కన్సిడర్ చేసి థర్డ్ అంపైర్ కి ఇచ్చాడు. సరే అక్కడేదో సున్నా మీదకు అప్పుడే వచ్చింది.ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్స్  కాబట్టి కన్సిడర్ చేశారు అనుకుందాం. రివ్యూలో తేలింది ఏంటంటే బాల్ కరెక్ట్ గా లైన్ మీద సగం అటూ సగం ఇటూ పడింది. అది రీ ప్లేలో స్పష్టంగా కనిపిస్తోంది. 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు ఆన్ గ్రౌండ్ అంపైర్ ఏం డెసిషన్ చెప్పాడో అదే కరెక్ట్ అయ్యేలా అంపైర్స్ కాల్ ఇస్తారు జనరల్ గా కానీ నిన్న అలా జరగలేదు. 50 పర్సెంట్ బాల్ లైన్ లోపల ఉన్నా కూడా పిచ్ అవుట్ సైడ్ అని ఇచ్చి థర్డ్ అంపైర్ రోహిత్ ను నాటౌట్ గా ప్రకటించారు. షాకింగ్ అసలు. ఇది జరిగినప్పుడు ముంబై స్కోరు 9..రోహిత్ స్కోరు 7.  మరి అప్పుడే నిర్ణయం సరిగ్గా ఉంటే అసలు రోహిత్ హాఫ్ సెంచరీ చేసేవాడు కాదు కదా. ఇది మొదటిది. ఇంకోటి రెండోది. ఆరో ఓవర్ ఆఖరి బంతికి జరిగింది. తీక్షణ బౌలింగ్ లో రికెల్టెన్ ఈ సారి బాల్ మిస్సయ్యాడు. ప్యాడ్ కి తగిలింది బాల్. లైన్ పడింది తను LBW అయిపోయాయని అనుకున్న రికెల్టెన్ డగౌట్ వైపు నడిచేయటం మొదలుపెట్టాడు. అయితే అంపైర్ మాత్రం అది అవుట్ అని చెప్పకపోవటం..బౌలర్లు అప్పీల్ కూడా చేయకపోవటంతో ఆగిపోయాడు. ఇక్కడ రికెల్టెన్ అవుటైనా కాకపోయినా...బ్యాటర్ తను ఇష్టానుసారంగా అవుట్ అనుకుని వెళ్లిపోతున్నప్పుడు అవుట్ ఇచ్చేయాలి. ఎందుకంటే ఈ రూల్ మొన్న ఇదే ముంబై హైదరాబాద్ మీద ఆడినప్పుడు వాడారు. అప్పుడు ఇషాన్ కిషన్ బ్యాట్ కి బాల్ తగలకున్న తను అవుట్ అనుకుని తనే వెళ్లిపోతుండటంతో దీపక్ చాహర్ అప్పీల్ చేయగానే అంపైర్ అవుట్ ఇచ్చాడు. ఎందుకంటే బ్యాటర్ వాలంట్రీగా వెళ్లిపోతున్నాడు కాబట్టి. మరి ఆ లెక్కన నిన్న రికెల్టెన్ కూడా అవుటేగా. కానీ అంపైర్ అలా అవుటివ్వలేదు. నిన్న రికెల్టెన్ కూడా హాఫ్ సెంచరీ బాది..ముంబై 217పరుగుల భారీ స్కోరు చేయటంలో హెల్ప్ అయ్యాడు. తెలియకుండా చేస్తుంటే కనీసం మనకు తెలియదు అనుకోవచ్చు. కానీ కళ్ల ముందే ఇలా అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు ముంబైకి కలిసి వస్తుంటే..ఫిక్సింగ్ కాక ఇంకేం అనాలి అనేది మిగిలిన టీమ్స్ అభిమానుల ప్రశ్న.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Aus vs Eng World Cup Final: నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
Ravi Bishnoi Unwanted Record: రవి బిష్ణోయ్ పేరిట వరస్ట్ రికార్డ్! ఇంగ్లాండ్ పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆ జాబితాలో చోటు
రవి బిష్ణోయ్ పేరిట వరస్ట్ రికార్డ్! ఇంగ్లాండ్ పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆ జాబితాలో చోటు
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget