అన్వేషించండి

MS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP Desam

 ఈ సీజన్ లో దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ నెక్ట్స్ మ్యాచ్ లు సంగతి పక్కన పెట్టి నెక్ట్స్ సీజన్ కోసం ఫైనల్ 11 ను ఎలా తయారు చేయాలా అని ఆలోచనల్లో పడింది. అందులో భాగంగానే టీమ్ లో ఉన్న యువకులను చిన్న కుర్రాళ్లను వరుసగా రెండు మ్యాచుల్లో ఆడించాడు కెప్టెన్ ధోనీ. సీఎస్కేకి ఫ్యూచర్ గా భావిస్తున్న షేక్ రషీద్, డెవాల్డ్ బ్రూయిస్, ఆయుష్ మాత్రే, అన్షుల్ కాంభోజ్ లాంటి ఆటగాళ్లకు ఇప్పటికే అవకాశాలు ఇచ్చిన CSK వాళ్లు ఫర్వాలేదనిపించటంతో నెక్ట్స్ మ్యాచెస్ లో కమలేష్ నాగర్ కోటి, కీపర్ బ్యాటర్ వంశ్ బేడీలను పరిశీలించాలని అనుకుంటోంది. అసలు ఇంత మందిని మార్చాల్సిన అవసరం రావటానికి కారణం టీమ్ లో ఉన్న ఎవరూ ఆడకపోవటమే అన్నాడు ధోనీ. ఓ ఈవెంట్ లో CSK ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడిన ధోని..ఆడటం ఆడకపోవటం అనేది ఆటల్లో సహజమే అయినా...గెలవాలన్న తపన ఈసారి ఆటగాళ్లలో లోపించటం తనను కాస్త బాధ పెట్టిందన్నాడు. స్వతహాగా సీఎస్కేను స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొంటుందని అలాంటిది ఈ సీజన్ లో పేస్ తో పాటు స్పిన్ కు వికెట్లు కోల్పోవటం..పరుగులు చేయలేకపోవటం లాంటివి బాగా ఇబ్బంది పెట్టాయని ధోనీ విశ్లేషించాడు. ఇప్పటికే 9 మ్యాచుల్లో 19మందిని పరిశీలించామని టోర్నమెంట్ లో తమకు ఇక మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ ఇదే తరహా ప్రయోగాలు చేసి వచ్చే ఏడాదికి ఒక పర్ఫెక్ట్ 11 టీమ్ తయారు చేయాల్సిన బాధ్యత జట్టులో సీనియర్ గా తనపైన ఉందన్నాడు మాహీ. ఐపీఎల్ లీగ్ లో సీఎస్కే ఎప్పుడూ ఛాంపియన్ జట్టులానే ఉందని ఓటముల్లో కూడా తమ జట్టుకు యాజమాన్యం నుంచి అమితమైన మద్దతు ఉంటుందన్న ధోనీ అదే తమందరినీ ఓ కుటుంబంలా కలిపి ఉంచగలుగుతుందన్నాడు. రానున్న ఐదు మ్యాచుల మీద ఫోకస్ చేయటంతోపాటు కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చి వచ్చే ఐదేళ్ల కోసం ఓ కోర్ టీ మ్ ను రూపొందించటమే ప్రస్తుతం తన లక్ష్యం అన్నాడు.

ఐపీఎల్ వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 first phase schedule: ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
BCCI Announces Reward: భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
ABP Premium

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Embed widget