Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్రేగ్ చాపెల్పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. చాపెల్ పదవీకాలం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని, టీమ్ ను బలహీనపరిచేందుకు ఆస్ట్రేలియా తరఫున ఆయన కుట్ర చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు.
తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన భజ్జీ.."చాపెల్ హెడ్ కోచ్గా ఉన్న సమయం టీమిండియాకు అత్యంత దారుణమైన కాలం. టీమ్ లో 'డివైడ్ అండ్ రూల్ పాలసీ అమలు చేశాడు. ప్లేయర్స్ మధ్య కావాలనే చిచ్చుపెట్టాడు. ఫలితంగా ప్రాణస్నేహితుల్లా ఉండే క్రికెటర్లు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు" అని హర్భజన్ అన్నారు.
"అప్పట్లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వగల ఏకైక జట్టు భారత్ మాత్రమే. అలాంటి టీమిండియాను లోపలి నుంచి దెబ్బతీస్తే ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుందనే ఉద్దేశంతోనే చాపెల్ కావాలని ఇలా చేసి ఉండవచ్చు. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీని పక్కనబెట్టడం, సీనియర్లను వేధించడం ద్వారా జట్టు యూనిటీను పూర్తిగా దెబ్బతీశాడు. దాని పరిణామమే 2007 వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి లీగ్ దశలోనే భారత్ నిష్క్రమించడం" అని భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు






















