Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత పవర్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన అద్భుతమైన టైమింగ్ తో ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేశాడు. కళ్లు చెదిరే రనౌట్‌తో న్యూజిలాండ్ బ్యాటర్ షాక్ ఐయేలాగా చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని అర్ష్‌దీప్ సింగ్ పర్ఫెక్ట్ యార్కర్‌గా వేసాడు .. క్రీజులో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ డిఫెన్స్ చేసి వెంటనే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బెవాన్ జాకబ్స్ రన్ కోసం వెల్లాగే, ఫాలో త్రూలో ఉన్న అర్ష్‌దీప్ సింగ్ క్షణాల్లో స్పందించాడు. చేతితో బంతిని అందుకునే సమయం లేకపోవడంతో, ఫుట్‌బాల్ ప్లేయర్ తరహాలో వేగంగా పరిగెత్తి బంతిని నేరుగా కాలికి తగిలించి వికెట్లపైకి నెట్టాడు.
అర్ష్‌దీప్ చేసిన ఈ పనితో నాన్ స్ట్రైకర్ బెవాన్ జాకబ్స్ ఊహించని రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. 'వారెవ్వా అర్ష్‌దీప్.. వాట్ ఏ స్పాంటేనిటీ అంటూ నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















