Donald Trump Won US Elections 2024 | అధికారం కోసం అణువణువూ శ్రమించిన ట్రంప్ | ABP Desam
ఎలాగైనా ఈసారి అమెరికా అధ్యక్షుడిగా నెగ్గి తీరాలన్న కసితో పనిచేశారు డొనాల్డ్ ట్రంప్. డెమోక్రాట్ల అభ్యర్థి, తన ప్రధాన శత్రువైన కమలాహారిస్ ను ఓడించటానికి సర్వశక్తులు ఒడ్డారు ట్రంప్. ప్రజలను ఆకర్షించటానికి ఏ అవకాశాన్ని వదులుకోలేదు ట్రంప్. తను సొంతంగా హామీలను ఇస్తూ ప్రజలను ఆకర్షించటం కంటే..కమలాహారిస్ ఏవి తన ఘనతలుగా ప్రచారం చేసుకుంటుందో అవన్నీ తనూ చేసి చూపించారు ట్రంప్. 78 ఏళ్ల వయస్సుల్లో హోటల్లో సర్వర్ గా పనిచేశాడు ట్రంప్. అపరకుబేరుడైన ట్రంప్ ఇలా ఓ మాములు పనివాడిలా హోటల్లో ఆలూ చిప్స్ ఫ్రై చేయటం..వాటిని కస్టమర్లకు స్వయంగా అమ్మటం లాంటివి అమెరికన్ మాస్ కు చేరువయ్యాడు. రిపబ్లికన్లను చెత్త అంటూ కమలాహారిస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టడానికి ఏకంగా చెత్తబండినే నడిపాడు ట్రంప్. ఇది కూడా ఊహించని షాక్ డెమోక్రాట్లకు. కమలను కేవలం మాటల మాంత్రికురాలిగా చిత్రీకరిస్తూ తను ఏం చెప్పినా చేతల్లో చేసి చూపిస్తాననే ప్రజలకు తెలిసేలా చేశారు ట్రంప్. అందుకే దాదాపు సగానికి పైగా ట్రంప్ కు మద్దతుగా నిలిచాయి. అధికారం కోసం ట్రంప్ ఈ పనులన్నీ చేశారని డెమోక్రాట్లు విమర్శించినా తను చేసింది అధికారం కోసం కాదని అమెరికా కోసం అంటూ తన నినాదాన్ని బలంగా వినిపించారు కాబట్టే రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయాన్ని అందుకున్నారు.