అన్వేషించండి
TDP Buddha Venkanna: బుద్దా వెంకన్న ఇంటి వద్ద భారీగా పోలీసులు
విజయవాడలోని తెలుగుదేశం నాయకుడు బుద్దా వెంకన్న ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతం సవాంగ్ పై వెంకన్న వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఇంటివైపు వస్తే కొడాలి నానిని చంపడానికైనా సిద్ధమని బుద్దా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన్ను ప్రశ్నించేందుకు పోలీసులు రాగా... నోటీస్ ఇస్తే స్టేషన్ కు వస్తానని వెంకన్న బదులిచ్చారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
హైదరాబాద్
క్రికెట్





















