అన్వేషించండి
ఇళ్ల స్దలాల వివాదంలో రగిలిన ఘర్షణ, 9మంది మహిళలకు గాయాలు..!
నెల్లూరు నక్కా గోపాల్ నగర్ లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారిపై కొంతమంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుడిసెల్ని పీకిపడేయడానికి ప్రయత్నించారు. అడ్డుకున్న వారిపై దాడి చేశారు. ఈ దాడిలో నెల్లూరు టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు, 30వ డివిజన్ టీడీపీ ఇన్ చార్జ్ ఆషిక్ కి గాయాలయ్యాయి. మరో 9మంది మహిళలకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించారు.
వ్యూ మోర్





















