EEE : ఏపిలో హాట్ టాపిక్ గా వంగవీటి రాధ, తెలంగాణలో రాజాసింగ్ వ్యాఖ్యలు దేనికి సంకేతం.?
బెజవాడ రాజకీయాలు మళ్లొకసారి హీట్ ఎక్కాయి. దివంగత వంగవీటి రంగా తనయుడు రాధను హత్యకు చేసేందుకు కుట్ర పన్నుతున్నారనీ, అందుకు తన ఇంటి మీద రెక్కీ కూడా నిర్వహించారని స్వయంగా రాధనే పేర్కొనడం సంచలనంగా మారింది. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అటు వైఎస్సాఆర్సీపీ నేతలు కూడా టచ్ లో ఉండంటం కూడా సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అటు రంగా వర్ధంతికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అటెండ్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటు తెలంగాణలో ఎప్పుూడూ హాట్ కామెంట్స్ చేసి రాజకీయ వాతావరణాన్ని హీట్ చేసే రాజాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరులోని జిన్నా టవర్ పేరు మారుస్తామని ప్రకటించారు. అంతేకాదు బీజేపీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిపేరుకూడా మార్చాలని అంటున్నారు.





















