Samantha Defamation Case: సమంత వీడియోలు, డేటా తొలగించాలని కోర్టు ఆదేశం
సమంత పరువు నష్టం దావా కేసులో వాదనలు విన్న కూకట్ పల్లి కోర్టు... ఆమెకు సంబంధించిన వీడియోలు తొలగించాలని మూడు యూట్యూబ్ ఛానెళ్లను ఆదేశించింది. సమంత వ్యక్తిగత విషయాలు ఎవరూ ప్రసారం చేయటానికి వీళ్లేదని కోర్టు అభిప్రాయపడింది. నాగచైతన్యతో సమంత విడాకుల నేపథ్యంలో పలు యూట్యూబ్ ఛానెళ్లు శ్రుతి మీరి ప్రచారం చేశాయి. సమంత వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాయి. ఈ ప్రసారాలు తన పరువుకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ నటి సమంత కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు ఆ వీడియో లింక్స్ వెంటనే తొలగించాలని సదరు యూట్యూబ్ ఛానెళ్లను ఆదేశించింది. ఇకపై సమంత వ్యక్తిగత, వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి ప్రసారాలూ చేయకూడదని స్పష్టం చేసినట్లు సమంత తరఫు న్యాయవాది తెలిపారు.





















