![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP Desam
రూటెడ్ గా ఉంటే చాలు స్క్రిప్ట్ కి చెబుతున్న కథకు ఆడియెన్స్ చాలా తేలిగ్గా కనెక్ట్ అయిపోతారు అని చెప్పిన సినిమా కాంతార. కేవలం ఓ నార్మల్ కన్నడ సినిమాగా విడుదలైన కాంతార జాతీయ స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యేకించి రిషబ్ శెట్టి గురించి మాట్లాడుకోవాలి. కేవలం లీడ్ రోల్ లో హీరోగా యాక్ట్ చేయటం కాదు ఆ సినిమాకు రైటర్ గా డైరెక్టర్ గా ప్రాణం పోశాడు రిషబ్ శెట్టి. కర్ణాటకలోని తుళునాడు ప్రాంతంలో వందల సంవత్సరాల ఆచారమైన భూతకోలా నృత్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని అక్కడి ప్రజల నమ్మకాలు విశ్వాసాలపై ఫ్లడ్ లైట్ వేశాడు రిషభ్ శెట్టి. కంబళ లాంటి గ్రామీణ క్రీడలను అతను ఈ సినిమా ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన విధానం, తనను ఓ గ్రామీణ యువకుడిగా మార్చుకున శైలి అన్నీ కాంతారా సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. కేవలం 53రోజుల్లో 400కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ను కైవసం చేసుకున్న కాంతార ఛాప్టర్ 1కు ఇప్పుడు జాతీయ అవార్డులు సైతం వరించాయి. జాతీయ ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి ఎంపిక కాగా...కాంతారా ఛాప్టర్ 1 జాతీయ ఉత్తమ పాపులర్ చిత్రం కేటగిరిలోనూ అవార్డును కైవసం చేసుకుంది.
![Allu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/29/f5c3252d63c4bdab400b64ed1c0d6d5c1732897870351310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)