Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2లో కామనర్ కేటగిరీ పోటీదారులు మెయిన్ హౌస్ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ రేసులో తన మాస్ వాయిస్, నటనతో విశేషంగా ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్ జానపద సింగర్, ‘రైతు బిడ్డ’ ఝాన్సీ.
ఝాన్సీ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన కోమటికుంట గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించింది. ఎలాంటి సంగీత నేపథ్యం లేకపోయినా, స్వయంకృషితో జానపద గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, చదువులోనూ ప్రతిభ చాటింది.
తెలంగాణ జానపద పాటలతో యూట్యూబ్‌లో ఝాన్సీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 'రామ్‌రెడ్డి దొర', 'అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య', 'అందాల రాధ', 'కాసరం కట్ట' వంటి హిట్ జానపద గేయాలతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. పొలంలో రైతుల కష్టాలను వివరిస్తూ చేసే వీడియోలు కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం అగ్నిపరీక్ష 2'లో జడ్జిలు నవదీప్, అభిజీత్, బిందు మాధవిలను మెప్పించేందుకు ఝాన్సీ టాస్కుల్లో కసితో పోరాడుతోంది. అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ 10 మెయిన్ హౌస్‌లోకి అడుగుపెట్టే ఆ 5-6 మంది కామనర్స్‌లో ఒకరిగా నిలిచేందుకు ఝాన్సీ గట్టి పోటీనిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















