Anant Ambani Radhika Merchant’s 2nd Pre-Wedding | 3రోజుల పాటు మహాసముద్రంలో అంబానీ పెళ్లి వేడుకలు
దేశంలోనే అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నీ మధ్యే గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు 1200కోట్ల రూపాయల ఖర్చుతో ప్రీ వెడ్డింగ్ వేడుకలను చేసుకున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట..ఇప్పుడు రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకకు సిద్ధమయ్యారు. అయితే ఈ భారీ వేడుకలకు వేదిక ఈ సారి ఇండియా కాదు. అసలు ఈ వేడుకలను వీళ్లు నేల మీదనే చేసుకోవటం లేదు.
ఇంతకు ముందు గుజరాత్ లో నిర్వహించిన మూడు రోజుల వేడుకకు మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, పాప్ సంగీత సంచలనం రిహానా, సచిన్ ధోని లాంటి క్రికెటర్లు బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆమీర్ ఖాన్ ఇంకా అనేక మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. ఇప్పుడు రెండో దశ వేడుకలకు సైతం ఇలానే అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈసారి వచ్చే అతిథుల్లో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్ లాంటి ఇండియన్ హీరోలతో పాటు హాలీవుడ్ స్టార్లు కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. వేడుకలకు హాజరయ్యే 800మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వటం కోసం ఆ విలాసవంతమైన క్రూజ్ షిప్ లో 600మంది సేవకులు ఉండనున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో అంబానీ కుటుంబం వేడుకలకు ప్లాన్ చేస్తుందో అని. అతిథుల ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా ఈవెంట్ లో నో ఫోన్ పాలసీని పాటించనున్నారు. ఈ మూడు రోజుల వేడుకల కోసం దాదాపుగా 2వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. జులైలో లండన్ లో అసలు పెళ్లి వేడుకలు జరగనుండా దానికంటే రెండోసారి ఇలా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
![Naga Chaitanya Thandel Real Story Ramarao | చైతూ రిలీజ్ చేస్తున్న తండేల్ కథ ఇతనిదే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/05/31a3486a19d0d2edbee70f1a9580ad891738742757148310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Prabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/e1723cbb957915809a4458bfd5ed56471738596605644310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Chiranjeevi Speech at Experium | ఎక్స్ పీరియమ్ థీమ్ పార్కును ప్రారంభోత్సవంలో చిరంజీవి | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/9a1c91aac5ebad7f3b1977709eaf0fb21738081112692310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/dbc80a1ebddad7c3ee641dc0a986c0b11737907499430310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Jr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/4d8e68fc980911ad6dea44cf3b4e72ec1737905114959310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)