Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం చేరింది. Forbes India 2026 ప్రకటించిన ప్రతిష్టాత్మక 'షోస్టాపర్స్ ఎడిషన్' కవర్ పేజీపై అల్లు అర్జున్ మెరిశారు.
ఈ కవర్ పేజ్ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండగా, మ్యాగజైన్ ఇంటర్వ్యూలో భారతీయ సినిమా భవిష్యత్తు, కథల ప్రాముఖ్యతపై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. "బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి భాషేమీ అడ్డంకి కాదు. బాలీవుడ్, సౌత్ లేదా మరే ఇతర ఇండస్ట్రీ అయినా సరే... స్టార్‌డమ్ కంటే కంటెంట్ ఉన్న సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది. కొత్త తరహా కంటెంట్‌ను ఆడియన్స్‌కు అందించడమే ప్రతి నటుడి ప్రధాన బాధ్యత" అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, మోహన్ లాల్, ఏఆర్ రెహమాన్, రిషబ్ శెట్టి, దుల్కర్ సల్మాన్ వంటి దిగ్గజాలు ఈ 2026 ఫోర్బ్స్ షోస్టాపర్స్ లిస్ట్‌లో నిలిచారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















