![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
NIA Raids At Anantapur | అనంతపురంలో ఉగ్ర కదలికలు.. NIA సోదాలు | ABP Desam
NIA Raids At Anantapur | అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో NIA సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు చేశారు. కొందరు యువకులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. ఆయన కుమారుల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. అబ్దుల్ కుమారులు కొంతకాలంగా బెంగుళూరులో నివసిస్తున్నారు. అయితే, వారు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. వారికి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయని ఆరోపణలు రావడంతో కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్ కుమారుడి ఎస్బీఐ అకౌంట్ కు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ అయ్యినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
![Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/fca359c30350dc6c265bc426829b24651719331570329953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/acc615e4597c537b97eef18b5960dbf91719328242625953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![BJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/2873ade0ee6896e54a7ed097dd30a05e1719327304305953_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Deputy CM Pawan Kalyan in Vaarahi Deeksha | 11రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1c679e5f1d98887039fefe9d0646de831719312502634310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![AP Govt Employees Association Suryanarayana Interview: 124 కోట్లు తింటే రూ.100 రికవరీ చేయలేకపోయారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/5192115490c63ec1fddcb8d3a01160e61719240784812953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)