అన్వేషించండి
Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు... ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న డ్రైవర్
నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు నెల్లూరు - ముంబై హైవే మరింత ప్రమాదకరంగా మారింది. హైవేపై సడన్ గా బ్రేక్ వేస్తే వాహనం గల్లంతేనని మరోసారి రుజువైంది. మర్రిపాడు మండలం నందవరం సమీపంలో బద్వేల్ నుంచి నెల్లూరుకు టమోటా లోడుతో వస్తున్న మినీ లారీ ఇలాగే రోడ్డుపై బోల్తా కొట్టింది. గేదె అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వర్షానికి రోడ్లు తడిసిపోవడంతో.. లారి స్కిడ్ అయి పక్కకు పడిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. టమోటాలన్నీ నేలపాలయ్యాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















