Money Cheating: బ్యాంక్ స్లిప్ కాదు, బట్టల షాపు ముద్ర.. నెల్లూరులో ఘరానా మోసం
పొదుపు మహిళల తరపున సొమ్ముని బ్యాంకులో జమ చేస్తానంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తికి చెందిన ఓ మహిళ ఘరానా మోసానికి తెరతీసింది. పొదుపు గ్రూపుల వద్ద డబ్బులు తీసుకుని వాటిని బ్యాంకులో జమచేయకుడా తానే స్వాహా చేసింది. పాపం అమాయక పేద మహిళలు ఆమెను బ్యాంకులో జమ చేసినందుకు రుజువుగా డిపాజిట్ స్లిప్ లు కూడా అడిగేవారు కాదు. ఒకవేళ అడిగినా వారికి ఆమె ఓ బట్టల షాపు స్టాంప్ వేసిన స్లిప్ ఇచ్చేది. స్టాంప్ పై పేరు ఏముందో కూడా తెలియని అమాయక మహిళలు వాటిని భద్రంగా దాచుకున్నారు. చివరకు ఆమె మోసం బయటపడిన తర్వాత ఆ స్లిప్ లపై ఉంది బ్యాంక్ స్టాంప్ కాదని, శ్రీనివాస కట్ పీసెస్ అనే బట్టల షాపు ముద్ర అని తేలడంతో వారంతా షాకయ్యారు. అందరూ కలసి బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.





















