Kadapa SP Siddharth Kaushal on AP Elections Counting | కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మరో వార్నింగ్ |ABP
కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మరో సారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల పోలింగ్ రోజు గొడవలు చేస్తే ఊరు ఊడిపిస్తానంటూ గతంలో రౌడీ మూకలకు హెచ్చరికలు జారీ చేసిన కౌశల్ ఇప్పుడు కౌంటింగ్ రోజు కోసం ముందస్తుగా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల కౌంటింగ్ రోజు కడప జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం లోని పలు స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ రోజున కమలాపురంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్ రోజు కూడా ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక దృష్టి సారించి అల్లర్లు సృష్టించే వారిపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందన్నారు. కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలకు, బాణా సంచా కాల్చేందుకు అనుమతి లేదన్నారు.