Kasam Venkateswarlu Interview | తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యింది | ABP Desam
తెలంగాణలో BJP అధికారంలోకి రావడం కోసం ఉన్న అన్నీ వ్యూహాలు అమలు చేస్తామని అంటున్నారు బీజేపీ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు. ABVP, BJYM ల్లో అనేక పదవులు చేసిన ఆయన తెలంగాణలో BJP మూల సిద్దాంతాన్ని ఎక్కడా పక్కన పెట్టడంలేదని అన్నారు. తెలంగాణానే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారం రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, 80శాతం ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతినకుండా చూడటమే తమ కర్తవ్యమన్నారు. మైనార్జీలు మెజార్టీ ప్రజల మీద పెత్తనం చలాయిస్తున్నారని అంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనీ, బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు ఎవ్వరైనా తమ పదవులకు రాజీనామాచేసే రావాలన్నారు. బీజేపీతోనే తెలంగాణ సంక్షేమం సాధ్యం అంటున్న కాసం వెంకటేశ్వర్లుతో ఏబీపీ దేశం ఇంటర్వూ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















