Viral Video: జోలపాట పాడుతూ చిన్నారిని నిద్ర పుచ్చుతున్న ఉపాధ్యాయుడు, ఎందుకంటే?
Viral Video: ట్రైనింగ్ కోసం వచ్చిన వారికి పాఠాలు చెబుతూనే ఓ ఉపాధ్యాయుడు.. తన స్టూడెంట్ కు చెందిన మూడు నెలల పాపకు జోల పాట పాడి నిద్ర పుచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Viral Video: సాధారణంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు వచ్చే గురువులు తమ విద్యార్థినీ, విద్యార్థులకు అంతో ఇంతో సీరియస్ గా పాఠాలు చెబుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో ఉన్న ఓ గురువు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో తన క్లాస్ కి తీసుకొచ్చిన ఓ స్టూడెంట్ కి చెందిన మూడు నెలల పాపకు లాలి పాట పాడాల్సి వచ్చింది. జోలపాట పాడుతూ.. ఆడిస్తూ నిద్ర పుచ్చే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
అసలేం జరిగిందంటే?
వరంగల్ కి చెందిన సీనియర్ సంగీత గురువు ఉమ్మాడి లక్ష్మణాచారి తన విధుల నిమిత్తం కరీంనగర్ లో టీచర్ ట్రైనింగ్ కోర్స్ కి సంబంధించిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే అందులో ఓ స్టూడెంట్ కి ఈ మధ్యనే డెలివరీ కావడంతో తన మూడు నెలల పాపతో సహా క్లాసులకు హాజరవుతోంది. అయితే ఆ చిన్నారి క్లాసులో చేస్తున్న అల్లరి చూసిన సదరు లెక్చరర్ తన జోల పాటతో నిద్ర పుచ్చడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతైనా కళాకారులకు సున్నిత మనస్సు కాస్త ఎక్కువే అనడానికి ఈ వీడియోని నిదర్శనమని పలువురు అంటున్నారు. మరికొందరేమో మ్యూజిక్ టీచర్ అంటే ఈ మాత్రం ఉంటది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అరికాలికి ఆపరేషన్, స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో భార్యను మోసుకెళ్లిన భర్త