అన్వేషించండి

Viral Video: ఈ బుడ్డోడు మామూలోడు కాదు, పాము తోకపట్టి ఎంత పనిచేశాడో తెలుసా?

Viral Video: చిన్న పిల్లాడికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బుడ్డోడు పాము తోక పట్టుకుని ఏం చేశాడో మీరూ చూడండి.

Viral Video: చిన్న పిల్లలు చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. వారి అల్లరి ముద్దుగా కూడా ఉంటుంది. అచ్చీరాని మాటలు, బుడి బుడి అడుగులు, వారి నవ్వు, ఆఖరికి ఏడుపు కూడా చాలా బాగుంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఉండే ఆ సందడే వేరు. వారితో చాలా ఎంజాయ్ చేయవచ్చు. వారి అల్లరి పనులు చూస్తూ చాలా టైం పాస్ చేయొచ్చు. వారితో గడిపే సమయం క్షణాల్లా గడిచిపోతుంటాయి. అయితే పిల్లలు చేసే కొన్ని కొన్ని పనులు ఎలా నవ్వు తెప్పిస్తాయో.. కొన్ని సార్లు గుండెలు జారి గల్లంతు కూడా అవుతుంటాయి. డేంజర్ పనులను కూడా పిల్లలను చేస్తూ ఉంటారు. అందుకే వారితో ఎంత ఎంజాయ్ చేస్తుంటామో.. అంతకంటే రెట్టింపు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటారు. 

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పిల్లలకు చెందిన వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో వాళ్లు చేసే అల్లరి పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. వారి ముద్దు ముద్దు మాటలు చెక్కిలిగింతలు పెడుతుంటాయి. బుడి బుడి అడుగులు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటాం. అలాగే కొన్ని వీడియాల్లో పిల్లలు డేంజరస్ పనులు కూడా చేస్తుంటారు. వారికి తెలియకుండా చాలా క్యాజువల్ గా ఇతర పనుల్లాగే చేస్తుంటారు. వారికి భయం అంటే తెలియదు.. ప్రమాదం గురించి అవగాహన ఉండదు. మంచికి, చెడుకు, ప్రమాదానికి తేడా తెలియదు. అలాంటి పిల్లలకు సంబంధించిన ప్రమాదకర వీడియాలు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కొన్ని వీడియాల్లో చిన్నారులు ప్రమాదకర జంతువులతో, ప్రాణులతో ఆడుకుంటూ ఉంటారు. అలాంటివి చూస్తున్నప్పుడు చూసే వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తాజాగా వైరల్ అవుతున్న వీడియోను ఫస్ట్ లవ్ అడిక్షన్ అఫీషియల్ అనే ఇన్‌స్టా పేజి పోస్టు చేసింది. అందులో ఓ బుడ్డోడు ప్రమాదకరమైన పని చేస్తూ కనిపిస్తున్నాడు. ఓ భారీ పొడవైన పాము తోకను పట్టుకుని.. ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లను లాక్కొచ్చినట్టు, తాడుతో ఆటాడుకుంటున్నట్లుగా బుడి బుడి అడుగులు వేస్తూ వెళ్తుంటాడు. అలా ఓ చిన్న దేవాలయంలోకి వెళ్తాడు. అందులో దేవుడిని ప్రార్థిస్తూ కొందరు మహిళలు కూర్చొని ఉంటారు. ఈ బుడ్డోడు చేతితో తీసుకువస్తున్న పామును చూసి వారు ఒక్కసారిగా జడుసుకుంటారు. దూరంగా జరుగుతారు. ఆ పామును బయటకు తీసుకెళ్లమని అరుస్తుంటారు.

వారి అరుపులకు ఆ బుడ్డోడు ఏమాత్రం తొణకడు బెణకడు. ఆ పాము ఏదో తన ఫ్రెండ్ అన్నట్లుగా, దానిని తాను పెంచుకుంటున్నట్లుగా ఏమాత్రం భయపడకుండా దానిని పట్టుకుని ఉంటాడు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి ఆ చిన్న పిల్లాడి చేయి పట్టుకుని బయటకు లాక్కొని వెళ్లిపోతాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 6.94 లక్షల మంది లైక్ చేశారు. వేలకొద్ది కామెంట్లు కూడా వచ్చాయి. చాలా మంది ఇన్ స్టా యూజర్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. 'యంగ్ మోగ్లీ తన ఇంటికి తిరిగొచ్చేశాడు అంటూ' ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. 'స్నేక్ పెయిడ్ యాక్టర్' అని మరొకరు కామెంట్ చేశారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget