Viral Video: కొత్తగా పెళ్లైన జంట రోడ్ సైడ్ ఏం చేస్తోందో చూడండి- వైరల్ వీడియో
Viral Video: జలంధర్‌లోని ఓ యువ జంట రోడ్‌సైడ్ స్టాల్‌లో పిజ్జా, పాస్తా విక్రయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video:
పరిస్థితుల్ని నిందించటం కాదు. వాటిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోవాలి. ఉన్న కొద్ది వనరులతోనే అద్భుతాలు సృష్టించిన వాళ్లెందరో ఉన్నారు. సొంతకాళ్లపై నిలబడాలన్న తపన ఉంటే ఎలాంటి సవాళ్లున్నా, సమస్యలున్నా సులువుగా అధిగ మించవచ్చు. ఇలాంటి స్ఫూర్తిని పంచే కథలు నెట్టింట్లో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. దివ్యాంగుడు పావ్‌భాజీ స్టాల్ నడపటం, రోడ్‌సైడ్‌లో ఓ టీచర్ టీ స్టాల్ పెట్టుకోవటం లాంటి వీడియోలు గతంలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కొత్తగా పెళ్లైన జంట పిజ్జా అమ్ముతూ కనిపించగా, కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పని పట్ల వాళ్లకున్న కమిట్‌మెంట్‌ను చూసిన నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. జలందర్‌లోని ఈ జంట పిజ్జాతో పాటు పాస్తా కూడా అమ్ముతోంది. ఓ ఇన్‌స్టా యూజర్ వీరి పని తీరు చూసి, వెంటనే వీడియో తీశాడు. "దాదాపు ఏడాదిగా ఈ పని చేస్తున్నాం. నేను చాలా మంచి చెఫ్‌ని. ఇంట్లో ఫుడ్ తయారు చేయటం నాకెంతో ఇష్టం" అని ఆ మహిళ చెప్పింది. "ఫ్రెష్ బైట్స్" పేరుతో ఈ స్టాల్‌ను నడుపుతోంది ఈ జంట. ఈ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా 32 మిలియన్ వ్యూస్, 4.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్స్ చేస్తున్నారు. "ఇద్దరూ కలిసి కల నెరవేర్చు కుంటున్నారు. కలిసే ఎదుగుతున్నారు" అని కొందరు కామెంట్ చేయగా, "నిజమైన ప్రేమకు ఇదే నిదర్శనం. చిన్న స్టాల్‌నే నడుపుతున్నా, వాళ్లెంతో ఆనందంగా ఉన్నారు" అని ఇంకొందరు మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram
Also Read: Mahesh Babu : ఆగస్టులో మహేష్ బాబు సినిమా సెట్స్ మీదకు వెళుతుందా? లేదా?
Also Read: Monkeypox Diet: మంకీపాక్స్ వ్యాపిస్తోంది, ఆ వైరస్‌ను తట్టుకునేందుకు ఈ ఆహారాలను మెనూలో చేర్చుకోండి
Before You Go
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















