అన్వేషించండి

Prakasam News: రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కున్న వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసు

Prakasam News: రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసు కాపాడాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది.

Prakasam News: రైలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, కదులుతున్న రైలు నుంచి దిగడం, ఎక్కడం ప్రమాదకరమని రైల్వే స్టేషన్లలోని మైకుల్లో చెబుతూనే ఉంటారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ప్రమాదాలకు గురవుతుంటారు చాలా మంది. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వల్ల ఒక్కో సారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు జారి ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కుని ప్రాణాలు వదలిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయినా రైలు కదిలేంత వరకు అక్కడే తచ్చాడుతూ.. తీరా కదిలాకా నింపాదిగా, నిర్లక్ష్యంగా ఎక్కడం వల్ల కాలు జారి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు చాలా మంది. 

నిర్లక్ష్యంగా రైలెక్కుతూ కింద పడ్డ ప్రయాణికుడు

రైల్వే ప్లాట్‌ఫాంలపై జరిగే ప్రమాదాలను, ప్రయాణికుల నిర్లక్ష్య వైఖరితో జరిగే ఘటనలను రైల్వే పోలీసులు ఎలా చాకచక్యంగా తప్పిస్తారో అంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి రైల్వే ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కున్నాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు వెంటనే స్పందించి రైలును ఆపుచేయించి తనను ప్రాణాలతో కాపాడాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 

సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

ఒంగోలు రైల్వే స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు ఒంగులో రైల్వే స్టేషన్ లో ఒకటో నంబర్ ప్లాట్ పాంపై వచ్చి ఆగింది. కాసేపటి తర్వాత కృష్ణా ఎక్స్ ప్రెస్ నెమ్మదిగా కదలడం మొదలైంది. కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించినా ఓ ప్రయాణికుడు కాలు జారి కింద పడ్డాడు. ప్లాట్ ఫాం, రైలుకు మధ్య ఇరుక్కున్నాడు. ఓ చేతితో హ్యాండిల్ ను పట్టుకుని రైలుతో పాటు ముందుకు కదిలాడు. ఇదంతా అక్కడే ఉన్న తోడి ప్రయాణికులు, వ్యాపారులు చూసినా కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 

ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసు

అంతలోనే అక్కడే మఫ్టీలో ఉన్న రైల్వే ఏఎస్ఐ శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. చాకచక్యంగా వ్యవహరించారు. రైల్వే బోగి, ప్లాట్ ఫాం మధ్య ఇరుక్కున్న ఆ ప్రయాణికుడిని పట్టుకుని బయటకు లాగి రక్షించాడు. ఈ ప్రమాదం నుంచి ఆ ప్రయాణికుడు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. అంతలోనే ఆ రైలు ఆగిపోయింది. ఆ తర్వాత ఆ ప్రయాణికుడు అదే రైలులో వెళ్లిపోయాడు. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన ఆ రైల్వే ఏఎస్ఐ శ్రీనివాస రావును ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. ప్రయాణికులకు ఎంత అవగాహన కల్పించినా ఇలాంటి ఘటనలూ తరచూ జరుగుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు కదిలేటప్పుడు కాకుండా నిలిచి ఉన్నప్పుడే ఎక్కి కూర్చుంటే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే అక్కడే ఉన్న రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయాలని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget