అన్వేషించండి

Viral Video: భారీ వరదల్లోనూ భలే ప్రయాణం - దుంగపై కూర్చొని దర్జాగా వెళ్తున్న వ్యక్తి

Viral Video: భారీ వరదల్లోనూ ఓ వ్యక్తి భలే ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. ఓ కర్ర దుంగపై కూర్చొని దర్జాగా వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

Viral Video: సాధారణంగా భారీగా వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా జనాలు ఇళ్లలోంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరైనా పడవల్లో వచ్చి సాయం చేస్తే తప్పు బయటకు రాలేరు. ముఖ్యంగా తమకు కావాల్సిన సరుకులను కూడా రెస్క్యూ సిబ్బంది వాళ్లే అందిస్తుంటారు. సహాయక సిబ్బంది చర్యలతోనే ప్రజలు సమస్యలు కాస్త తీరుతుంటాయి. కానీ ఓ వ్యక్తి మాత్రం భారీ వరదల్లోనూ భలేగా ప్రయాణం చేస్తున్నాడు. కారులో, విమానంలో వచ్చినంతగా హాయిగా వచ్చేస్తున్నాడు. అలా అని అతను వచ్చేదేదో పెద్ద బోట్ అనుకునేరు. అదేం కాదండి.. ఓ కర్ర దుంగపై కూర్చొనే తనకు నచ్చిన చోటుకు వెళ్తున్నాడు. కావాల్సినవి కొనుక్కుంటున్నాడు. అతను వెళ్తున్న తీరు చూస్తుంటే ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేరు. ఎందుకూ అంటారా..!

వాటర్ బాటిల్ కొనుక్కునేందుకు వెళ్లిన వ్యక్తి

మనిషి మునిగే స్థాయి వరకు వచ్చిన వరద నీటిలోనే ఓ వ్యక్తి చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. ఓ పెద్ద కర్రపై దర్జాగా కూర్చొని పడవపై వచ్చినట్లుగా వస్తున్నాడు. చేతిలో మరో కర్ర పట్టుకొని అడ్డుగా వచ్చిన వాటిని పక్కకు జరుపుకుంటూ నచ్చిన చోటుకు వెళ్తున్నాడు. తనకు కావాల్సినవి కొనుక్కుంటున్నాడు. వీడియోలో ఉన్న వ్యక్తి ఓ మెడికల్ షాపు వద్దకు వెళ్లి తనకు కావాల్సిన మందులతో పాటు ఓ వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. అందుకు తగిన డబ్బులను కూడా ఓ కవర్ లో పెట్టుకొని తెచ్చుకున్న అతడు వారికి ఇచ్చాడు. అనంతరం అక్కడే నీళ్లు తాగి వెనుదిరిగాడు. అక్కడున్న వారంతా అతడిని చూస్తూ నవ్వుకున్నారు. భలేగా ప్రయాణిస్తున్నాడని కొనియాడారు. 

163.3కే వ్యూస్ తో దూసుకెళ్తున్న వీడియో

ఈ వీడియోని Hasna Zaroori Hai అనే నెటిజెన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. మంగళవారం రోజు ఉదయం 6.04( జులై 11) గంటలకు షషేర్ చేయగా.. ఇప్పటి వరకు 163.3కే వ్యూస్ వచ్చాయి. అలాగే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు చేశారు. టూ గుడ్ మ్యాన్, నాచురల్ బండి అంటూ రాసుకొస్తున్నారు. ఐడియా అదిరింది గురూ అని కొందరు, కోటీశ్వరులు కూడా ఇలాంటి రైడ్ ను ఎంజాయ్ చేయలేరని మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. మీరూ ఈ ఈడియోపై ఓ లుక్కేయండి.   

బైక్ పై ఎనిమిది మంది ప్రయాణం - వీడియో వైరల్

ఇటీవలే నెట్టింట ఓ వీడియో వైరల్ అయింది. అందులో ఓ వ్యక్తి స్కూటీ నడుపుతుండగా.. ముందు ఇద్దరు చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకొని మరీ నిల్చున్నారు. వాహనం నడుపుతున్న అతని వెనుక ముగ్గురు కూర్చోగా... కాళ్లు పెట్టుకుని కూర్చునే స్టాండ్ పై పక్కన మరో బాలుడు నిల్చుని ఉన్నాడు. వెనకాల నెంబర్ ప్లేట్ కు కాస్త మీదుగా ఉండే స్టీల్  రాడ్‌పై మరో బాలుడు నిల్చొని డ్రైవర్ భుజాలను పట్టుకున్నాడు. ఇలా మొత్తం బండి మీద ఎనిమిది మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంత ప్రమాదకర రీతిలో స్కూటీపై ప్రమాదం చేస్తుండగా.. చూసిన పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది చూసిన నెటిజెన్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇంత మంది చిన్న పిల్లలతో ప్రయాణం అవసరమా అని కొందరు.. ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటని మరికొందకు కామెంట్లు చేస్తున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

Viral Video: అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget