Viral News: పిల్ల రాలేదని, పిల్లోతో సరిపెట్టుకున్నాడు-వీడిది మామూలు బుర్ర కాదు
Viral News: తన భార్య ట్రిప్‌కు రాలేదని, ఆమె ఫేస్‌తో ఉన్న పిల్లోతో టూర్‌కు వెళ్లాడు ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి. ఆ పిల్లోతో దిగిన ఫోటోలో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Viral News:
ఈ బిజీ లైఫ్‌లో భార్యాభర్తలు కలిసి షికారుకెళ్లాలంటే ఓ పది రోజుల ముందే ప్లానింగ్ చేసుకోవాలి. చివరి క్షణం వరకూ ట్రిప్‌కు వెళ్తామో లేమో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఆఫీస్‌లో లీవ్ దొరక్క కొందరు, ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఇంకొందరు డ్రాప్ అవుతుంటారు. ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ జంట ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. ఈ హడావుడి జీవితానికి కాస్తంత దూరంగా ఎక్కడికైనా వెళ్దామని ఈ జంట ప్లాన్ చేసుకుంది. ఆఖరి నిముషంలో "వర్క్" ఉందని భార్య చాలా బాధగా చెప్పింది. "అయ్యో ఇలా జరిగిందే" అని కాసేపు బాధ పడి, వెంటనే తన బుర్రకు పదును పెట్టాడు. అదిరిపోయే ఐడియాతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. తన భార్య పక్కన లేకుండా ట్రిప్ చేయలేను అనుకున్నాడో ఏమో ఆమె ఫేస్ ప్రింట్ చేసిన ఉన్న దిండుని వెంట తీసుకెళ్లాడు. ఎక్కడికెళ్తే అక్కడికి ఆ పిల్లోని పక్కనే పెట్టుకున్నాడు. నచ్చిన ప్లేస్‌కు వెళ్లగానే వెంటనే ఆ పిల్లోని పక్కన పెట్టుకుని ఫోటోలు దిగాడు. పైగా తన భార్యను తలుచుకుంటూ ఆ పిల్లోకి ముద్దులు కూడా పెట్టాడు. ఈ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. "భలే ఐడియా" గురూ మెచ్చుకుంటున్నారు.
😁😁😂😆 คลั่งรัก
— @dairangok ได้_แรง_อก🏆เพจ:ฟีเวอร์ 2 ปีซ้อน (@dairangok) July 13, 2022
กลายเป็น #ไวรัล จากประเทศ #ฟิลิปปินส์ 📍📍📍
คุณ Raymond Tan Fortunado ภรรยาของเขา ไปเที่ยวกับเขาด้วยไม่ได้ ติดธุระ เขาจึงสั่งทำ #หมอนหน้าเมีย พกไปเที่ยวด้วยทุกที่ ทำชาวเน็ตอิจฉาสุด😁😁 pic.twitter.com/2Z1A3DnhWO
Nope, he is not forever alone.. His wife just had a last minute assignment so he decided to go to a couple holiday alone.. HOOOOLD ON...
— Vygr Media (@VygrNews) July 24, 2022
With his wife's meme-face pillow 😂 😁 #bizarre #couplegoals pic.twitter.com/xtMNiInfzS
Also Read: Illegal Bar Row: కాంగ్రెస్‌కు లీగల్ నోటీసులు పంపిన స్మృతి ఇరానీ, క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Also Read: Arvind Kejriwal Update: పీఎం ఫోటో పెట్టినందుకు సీఎం అలక! ఈవెంట్‌కు రాకుండా డుమ్మా కొట్టారు





















