అన్వేషించండి

Viral News: 13 గంటలు క్యాబ్ లో తిరిగింది, డబ్బు ఇవ్వమంటే దబాయింపు- వైరల్‌గా మారిన మహిళ తీరు

Viral News: గురుగ్రామ్ లో ఓ మహిళ ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది. 13 గంటల పాటు క్యాబ్‌లో తిరిగి డబ్బు ఇవ్వకుండా గొడవకు దిగింది.

Viral News: గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురుగ్రామ్ లోని సైబర్ సిటీలో ఓ మహిళ.. క్యాబ్ లో 13 గంటల పాటు ప్రయాణించింది. చివరికి క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడగడంతో తనపై వేధింపుల కేసు పెడతానని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి డబ్బులు కట్టకుండానే వెళ్లిపోయింది. సదరు మహిళ.. క్యాబ్ డ్రైవర్ తో, పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జ్యోతి అనే మహిళ అర్ధరాత్రి మేదాంత ఆస్పత్రి సమీపం నుంచి ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నట్లు క్యాబ్ డ్రైవర్ దీపక్ తెలిపారు. అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఒక చోటు నుంచి మరో చోటుకు తిప్పుతూనే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇలా తరచూ డెస్టినేషన్లను మారుస్తూ ఉండటంతో.. అసలెక్కడికి వెళ్లాలో స్పష్టంగా చెప్పాలని అడిగానని, తను చెప్పకపోవడంతో సైబర్ సిటీలో డ్రాప్ చేసినట్లు దీపక్ చెప్పారు. ట్రిప్ ముగిసిన తర్వాత ఆ మహిళ డబ్బు ఇవ్వలేదని, గట్టిగా అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు ఆ క్యాబ్ డ్రైవర్ వాపోయాడు. 

దీంతో గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు డ్రైవర్ దీక్. పేటీఎం ద్వారా చెల్లింపు చేస్తానని జ్యోతి చెప్పినప్పటికీ.. రెండు గంటలు అయినా డబ్బులు పంపించలేదని దీపక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ జ్యోతి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న మరో మహిళ రికార్డు చేసిన ట్విట్టర్ లో సదరు వీడియోను పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. 

జ్యోతి ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు

క్యాబ్ లో గంటలకు గంటలు ప్రయాణించి చివరికి డబ్బులు చెల్లించకుండా డ్రైవర్లతో గొడవలకు దిగడం, తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించడం జ్యోతికి ఇదే మొదటిసారి కాదని.. గతంలోనూ ఇలా చేసినట్లు దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే మహిళ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. సదరు మహిళ క్యాబ్ లు బుక్ చేసుకుంటూ.. వేధింపుల కేసులో ఇరికిస్తానని డ్రైవర్లను బెదిరిస్తున్నట్లు రాసుకొచ్చారు. పోలీసులు ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Teen Tigada Series OTT : ఓటీటీలోకి సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Embed widget