అన్వేషించండి

YS Sharmila: దొంగే దొంగ అన్నట్లుంది కేటీఆర్ తీరు - వైఎస్ షర్మిల సెటైర్లు

రాష్ట్రం పేరుతో వేల ఎకరాలు కాజేశారని ఆరోపించారు. నీళ్లు, నిధులను సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారని, మొత్తానికి బందిపోట్ల రాష్ట్ర సమితి రాష్ట్రం మొత్తాన్ని దోచేసుకుంటోందని ఆరోపించారు.

వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ఫ్యామిలీని లక్ష్యంగా చేస్తూ మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈసారి మంత్రి కేటీఆర్‌పై ఘాటుగా స్పందించారు. కుటిల యత్నాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, విచ్ఛిన్నకర కర శక్తుల్ని తిప్పికొట్టాలని దొర చెప్తూ ఉంటారని అన్నారు. ఆ విచ్ఛిన్నకర శక్తులు మీరే కదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం పేరుతో వేల ఎకరాలు కాజేశారని ఆరోపించారు. నీళ్లు, నిధులను సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారని, మొత్తానికి బందిపోట్ల రాష్ట్ర సమితి రాష్ట్రం మొత్తాన్ని దోచేసుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం (సెప్టెంబరు 11) ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.

‘‘దొంగే దొంగా దొంగా అన్నట్లుంది మంత్రి కేటీఆర్ తీరు. విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టాలని చెప్పే దొర గారు.. కుటిల యత్నాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అసలైన శక్తులు మీరే కదా. బంగారు తునకపై 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరే. రాష్ట్రం నెత్తిన అప్పులు మోపి లక్ష కోట్లు కాజేసిన శక్తులు మీరే. 9 ఏళ్లలో 8 వేల మంది రైతులను, ఉద్యోగాలు అని చెప్పి వందల మంది నిరుద్యోగులను, పొట్టన పెట్టుకున్న అతీత శక్తులు మీరే. రాష్ట్రం పేరు చెప్పి వేల ఎకరాలు కాజేసిన భూ బకాసుర శక్తి మీరే. తెలంగాణ నినాదాన్ని వక్రీకరించి, నీళ్లను ఫామ్ హౌజ్ కి పారించి, నిధులను సొంత అవసరాలకు తరలించి, నియామకాలను కుటుంబానికే ఇచ్చుకున్న బంది పోట్ల రాష్ట్ర సమితినే ఈ రాష్ట్రానికి విచ్ఛిన్నకర శక్తి. ప్రజల సొమ్ముతో స్వార్థ రాజకీయలు చేస్తూ, ఉజ్వల తెలంగాణ చరిత్రను పూర్తిగా పక్కదారి పట్టించి, ఉద్యమ కారులను అణగదొక్కి, తెలంగాణ జీవనాడిని కలుషితం చేసిన మీరే అసలైన అవకాశవాదులు’’ అని వైఎస్ షర్మిల ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget