అన్వేషించండి

Komatireddy Issue : కోమటిరెడ్డిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా ? థాక్రే తీసుకోబోయే నిర్ణయం ఏమిటి ?

కోమటిరెడ్డిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా ? పార్టీని పదే పదే డ్యామేజ్ చేస్తున్నా ఎందుకు చూసీ చూడనట్లుగా ఉంటున్నారు ?

 

Komatireddy Issue :   తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్‌తో పొత్తు ఖాయమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయని.. పార్టీకి చెడు చేసే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఆ పార్టీలో వినిపిస్తున్నారు. అసంతృప్త సీనియర్లు కూడా ఆయనకు వ్యతిరేకంగానే  వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తో కలవాల్సిన పరిస్థితి రాదని.. కోమటిరెడ్డివి వ్యక్తిగత వ్యాఖ్యలన్న వాదన వినిపిస్తున్నారు. శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి నేరుగానే తమ అభిప్రాయం చెప్పారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమని పట్టించుకోవాల్సిన అవసరం లేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్‌తో  బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని స్పష్టం ేచశారు. 

ఈ సారి కోమటిరెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే... కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించారు. వీడియో చూసి ఆయన ఓ అభిప్రాయానికి వచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  బుధవారం ఉదయం తనను కలవాలని కోమటిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి  వస్తారో లేదో కానీ..  ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా చాలా ఫిర్యాదులు వెళ్లాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో కోవర్టుగా పని చేస్తున్నారని ఆయనను నమ్మడం వల్ల పార్టీ మునుగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. కొంత మంది నేతలు బహిరంగంగానే కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇటీవల మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా కూడా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.  తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగినా ఆయన పాల్గొనలేదు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవదని ప్రకటించారు. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఆయనకు రెండు సార్లు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే అది తన వీడియో కాదని మార్ఫింగ్ చేశారని కోమటిరెడ్డి షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్  ఆ సమాధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త ఇంచార్జ్ గా మాణిక్ రావ్ థాక్రే వచ్చిన తర్వాత గాంధీ భ వన్‌కు కూడా వచ్చారు. రేవంత్ తో కూడా సమావేశంయ్యారు. దీంతో సమస్య పరిష్కారం అయిందని..ఇక కోమిటిరెడ్డి సర్దుకుపోతారని అనుకున్నారు. 

కానీ కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చిన హాత్ సే  హాత్ జోడోయాత్రను కోమటిరెడ్డి ప్రారంభించలేదు. హఠాత్తుగా ఆయన  ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలవలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో ఉన్నారు.  తరచూ బీజేపీ అగ్రనేతల్ని కోమటిరెడ్డి కలుస్తున్నారు. వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు. . ఇదంతా కావాలనే చేస్తున్నారని.. పార్టీలో ఉంటూ.. పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది.                

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget